చర్చ్ బ్లాగులు

ఆధ్యాత్మిక వ్యాసాలు మరియు ప్రత్యేక వర్తమానాలు
JOHN SUNDAR KUMAR
January 01, 2026

ఒక నూతన సంవత్సరం ఎలా ప్రారంభించాలి?

ఒక నూతన సంవత్సరం ఎలా ప్రారంభించాలి?మన జీవితంలో ఒక నూతన సంవత్సరం జరుపుకున్నప్పుడు అది దేవుని దయా కిరీటము అని గుర్తించాలి. ఒక విశ్వాసి పుట్టినరోజు లేదా వార్షికోత్సవం జరుపుకున్నప్పుడు తప్పకుండా పాటించవలసినవి ఒక "ఐదు విషయములు" దేవుని వాక్యము నుండి చూద్దాము.1) గత కాలములో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకోవాలి (Think of past Blessings): కీర్తనలు 77: 11-12 లో'యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును' అని చూస్తాము. దేవుడు మన చిన్ననాటినుండి ఇప్పటి వరక చేసిన ఆశ్చర్య కార్యాలు ఆలోచించాలి.2) దేవునికి మనసారా కృతజ్ఞత చెల్లించాలి (Thank God) : దేవుడు చేసిన మేళ్ళను తలపోసుకున్నప్పుడు హృదయం నుండి కృతజ్ఞత ఉప్పొంగుతుంది. కీర్తనలు 34:1 లో నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని దావీదు దేవుడు చేసిన మేలులను బట్టి మనసారా దేవునికి స్తుతులు చెల్లించాడు.3) మన భవిష్యత్తు దేవుడు చూసుకుంటాడు అని విస్వాసముంచాలి (Trust God for your Future): సామెతలు 3:5-6 లో 'నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము, ఆయన నీ త్రోవలను సరాళము చేయును.' అని చూస్తాము.4) దేవునికి నచ్చనివి మనము విడిచి పెట్టాలి (Turn away from sin): మన జీవితాన్ని పరీక్షించుకొని ఏమైన తప్పులు దేవుడు చూపిస్తే వాటిని వెంటనే విడిచిపెట్టాలి. 1 పేతురు 4:3 లో అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును అని చూస్తాము.5) దేవుడు మనకు ఇచ్చిన బాధ్యతలు జ్ఞాపకము చేసుకోవాలి (Take God's call seriously): 1 కొరింథీ 1: 26. సహెూదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. రక్షింపబడిన వ్యక్తి దేవుడు తనకు అప్పగించిన బాధ్యతలు ఖచ్చితముగా నెరవేరుస్తాడు. అవి ఉద్యోగ బాధ్యత, కుటుంబ బాధ్యత, సంఘంలో పరిచర్య, సువార్త సేవ, ఆత్మీయ జీవితం, ఆరోగ్యం వంటివి. ఒక వేళ అవి గత కాలములో నిర్లక్ష్య పెట్టినా మళ్లీ ఆసక్తి గా చెయ్యాలి.ప్రియ చదువరి. ఈ బాధ్యతలు పాటించి ఆత్మీయ జీవితములో ముందుకు సాగుదము. దేవుడు మిమ్మును దీవించు గాక!! ఆమెన్.